Monday, January 5, 2026
E-PAPER
Homeజాతీయంటెస్లాను దాటిన బీవైడీ

టెస్లాను దాటిన బీవైడీ

- Advertisement -

గ్లోబల్‌ విక్రయాల్లో టాప్‌లోకి..

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలన్‌మ స్క్‌కు చెందిన టెస్లాను చైనా ఆటోమొబైల్‌ దిగ్గజం బీవైడీ అధిగమించింది. గడిచిన ఏడాది 2025 విక్రయాల్లో మొదటిసా రిగా టెస్లాను బీవైడీ వెనక్కి నెట్టింది. గ్లోబల్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్‌ వాహనాలను విక్రయించిన సంస్థగా బీవైడీ రికార్డ్‌ సృష్టించింది. మరోవైపు టెస్లా అమ్మకాలు తొలిసారి తగ్గిపోయాయి. 2025లో గ్లోబల్‌గా టెస్లా 16.3 లక్షల యూనిట్లను డెలివరీ చేసింది. ఇది గత ఏడాదిలోని 17.3 లక్షల యూనిట్లతో పోలిస్తే 8.6 శాతం తగ్గుదల. వార్షిక ఉత్పత్తిలోనూ 6.7 శాతం పతనాన్ని చవి చూసింది. మరోవైపు 2025లో బీవైడీ 46 లక్షల యూనిట్లను డెలివరీ చేసింది.

ఇది 2024 కంటే 7.7 శాతం అదనం. ఇందులో కేవలం పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు 28 శాతం పెరిగి 22.5 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ‘చైనా నూతన ఇంధన వాహనాల తయారీదారులు ఉత్పత్తి, సరఫరా గొలుసులలో మరింత పోటీతత్వాన్ని సాధిస్తున్నారు. ఈ కంపెనీలు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)పై నిరంతరం పెట్టుబడులు పెట్టడం, సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేయడం, చైనాలోని అధునాతన తయారీ ఫ్యాక్టరీలు తదితర అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయి.” అని చైనా ప్యాసింజర్‌ కార్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ జనరల్‌ కుయ్ డాంగ్‌షు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -