8 స్థానాల‌కు బైపోల్స్..రెండు కాంగ్రెస్ కైవ‌సం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప‌లు అసెంబ్లీ స్థానాల‌కు ఉపఎన్నిక‌లు జరిగిన విష‌యం తెలిసిందే. తాజాగా వెలువ‌డిన ఫలితాల్లో ఆయా పార్టీలు విజ‌యం సాధించాయి. పంజాబ్‌లోని టార్న్ తరణ్ అసెంబ్లీ బైపోల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. ఆ రాష్ట్ర అధికార పార్టీ ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,091 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో పంజాబ్ సీఎం భ‌గ‌వ‌త్ మాన్‌కు ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్స్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు.

జ‌మ్మూలోని నా జమ్మూ కాశ్మీర్‌లోని నగ్రోటా స్థానంలో బీజేపీకి అభ్య‌ర్థి దేవయాని రాణా 24,647 ఓట్ల అధిక్యతతో గెలిచారు.మిజోరంలోని డంపా బైపోల్‌లో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి విజ‌యం సాధించాడు. ఆర్ లాల్తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాజస్థాన్‌లోని అంటా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విక్ట‌రీ సాధించారు. బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్‌పై ప్రమోద్ జైన్ 15,612 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెలంగాణ‌లోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. హ‌స్తం అభ్య‌ర్థి న‌వీన్ కుమార్ యాద‌వ్ 24వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.