Wednesday, January 7, 2026
E-PAPER
Homeబీజినెస్మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా సిఎ మురళీ మనోహర్‌

మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా సిఎ మురళీ మనోహర్‌

- Advertisement -

వైస్‌ చైర్మెన్‌గా గోవింద్‌ నారాయణ్‌ రాఠీ
కొత్త కార్యవర్గం ఎన్నిక


నవతెలంగాణ – హైదరాబాద్‌
ఏపీ మహేష్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నూతన చైర్మెన్‌గా సిఎ మురళి మనోహర్‌ పలోడ్‌ ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా గోవింద్‌ నారాయణ్‌ రాఠీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో స్థాపించబడిన ఈ బ్యాంక్‌ సహకార రంగంలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉండి.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో 45 శాఖల నెట్‌వర్క్‌తో సేవలందిస్తోంది. హైదరాబాద్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో నూతన పాలకమండలిలోని 15 మంది డైరెక్టర్ల స్థానాలకు 2025 డిసెంబర్‌ 7న ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన నూతన బోర్డు సభ్యుల పదవీ కాలం 5 ఏండ్లు ఉంటుంది.

నూతన డైరెక్టర్ల బోర్డులో మురళీ మనోహర్‌ పలోడ్‌, గోవింద్‌ నారాయణ్‌ రాఠీ, అల్కా జాన్వర్‌, అమిత్‌ లడ్డ, భాంగడియా కైలాష్‌ నారాయణ్‌, దీపక్‌ కుమార్‌ బంగ్‌, దేవేందర్‌ ఝావర్‌, కవిత తోష్నివాల్‌, మనోజ్‌ లోయా, ముకుంద్‌లాల్‌ బాహెతి, పవన్‌ కుమార్‌ లోహియా, రూపేష్‌ సోని, వినోద్‌ కుమార్‌ బంగ్‌ ఉన్నారు. తనపై నమ్మకం ఉంచి చైర్మెన్‌గా ఎన్నుకున్నందుకు మురళి మనోహర్‌ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంక్‌ ఆర్థిక పనితీరును బలోపేతం చేయడం, కస్టమర్‌ సేవలను మెరుగుపరచడం, నిబంధనల పాటించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. వ్యక్తిగత సేవలందించడంతో పాటు, డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే బ్యాంక్‌కు పునర్‌వైభవం తీసుకోస్తామని ఆ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ వి అరవింద్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -