- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల మార్పు, చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్, అధిష్ఠానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక అని చెప్పారు.
- Advertisement -



