Sunday, October 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకుప్పకూలిన కేఫ్..ఇద్దరు మృతి

కుప్పకూలిన కేఫ్..ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి 65 సమీపంలో నూతనంగా నిర్మించిన బంకిట్ కాఫీ కేఫ్ లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పెద్ద చెరువు బఫర్ జోన్ లో ఎలాంటి అనుమతులు లేకుండా డాన్కిన్ కాఫీ కేఫ్ ను నిర్మించారు. ఈ కాఫీ కేఫ్ నిర్మాణంలో పైకప్పుగా రేకులు వేసి ఆ రేకుల పై వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంక్ లో పూర్తిగా నీళ్లు నింపడం మూలంగా రేకులు ట్యాంకు బరువును ఆపలేక కుప్ప కూలిపోయింది. ఆదివారం కేఫ్ ప్రారంభం కానుండడంతో దాని యజమాని శివ ఆయన కుటుంబ సభ్యులు అందులోనే నిద్రించారు. ట్యాంకు వారిపై పడి భార్య నాగమణి (32) కుమారుడు (6) లు అక్కడికక్కడే మృతిచెందగా యజమాని తల్లి, కూతుర్లకు తీవ్రగాయాలు కావడంతో నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -