- Advertisement -
నవతెలంగాణ – అడ్డగూడూరు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అడ్డగూడూరు టాస్కా శాఖ తరపున మంగళవారం తహసిల్దార్ శేషగిరిరావుకు, అడ్డగూడూరు గ్రామ నూతన సర్పంచ్ పూజరి వనజసైదులు గౌడ్ కి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం వారికి టాస్కా డైరీ, క్యాలెండర్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టాస్కా మండల అధ్యక్షులు కానుగుల రాము, కార్యదర్శి బైరెడ్డి రామిరెడ్డి, ఉపాధ్యక్షులు జక్కుల యాదగిరి, కార్యవర్గ సభ్యులు విశ్వనాథం ,బుచ్చి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



