ఐసీసీ మహిళల వరల్డ్‌కప్
ముంబయి : యువ బ్యాటర్, విధ్వంసక ఓపెనర్ షెఫాలీ వర్మకు ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతికా రావల్ చీలమండ గాయంతో సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైంది. దీంతో భారత ప్రపంచకప్ జట్టులో షెఫాలీ వర్మకు చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గురువారం ముంబయిలో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో తలపడే భారత జట్టులో షెఫాలీ వర్మ భాగం కానుంది.
2014 అక్టోబర్ నుంచి వన్డే మ్యాచ్ ఆడని షెఫాలీ వర్మ.. భారత్-ఏ తరఫున ఫామ్ చాటుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను మలుపు తిప్పగల షెఫాలీ వర్మ కంటే నిలకడగా రాణించే ప్రతికా రావల్ వైపు సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది. తాజాగా ప్రతికా గాయంతో దూరమవగా.. షెఫాలీ వర్మకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కింది. షెఫాలీ వర్మ ఎంపికను ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదించింది.



