Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని పిలుపు..

రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని పిలుపు..

- Advertisement -

తహసిల్దార్ సతీష్ రెడ్డి..

నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిచిన కొత్త భూభారతి చట్టంపై డిచ్ పల్లి మండలంలోని అయా గ్రామాలలో రెవిన్యూ సదస్సులను నిర్వహించ తలపెట్టినమని, జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు జూన్  03.06.2025 నుండి 13.06.2025 వరకు మండలంలో గల అన్ని రెవిన్యూ గ్రామాలలో రెండు టీమ్ లుగా ఏర్పడి షెడ్యూల్ లో చూపిన ప్రకారంగా రెవిన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తహసిల్దార్ సతీష్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ రెవిన్యూ సదస్సులలో అన్ని రకాల భూ సమస్యలను నిర్దేశించబడిన దరఖాస్తులలో స్వీకరించడం జరుగుతుందని, డిచ్ పల్లి మండలం లోగల అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ సతీష్ రెడ్డి సూచించారు.

 సదస్సులు-టీం వివరాలు & 3వ తేదీ నుండి షెడ్యూల్ 03 జూన్ ఎంపిపిఎస్, సుద్దులం, కమలాపూర్ గ్రామ పంచాయతీ, 04.న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దపల్లి, బీబీపూర్ గ్రామ పంచాయతీ లో,05.న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెంట్రాజ్ పల్లిలో, గ్రామ పంచాయతీ మిట్టపల్లిలో, 06.న బర్దీపూర్ రైతు వేదిక లో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిల్లా  డిచ్‌పల్లిలో 09న యానంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, రాంపూర్ గ్రామంలోని రైతు వేదికలో, 10న రైతు వేదిక నడిపల్లి లో, గ్రామ పంచాయతీ కార్యాలయం ముల్లంగిలో, 11న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమృతపూర్ లో, గ్రామ పంచాయతీ కార్యాలయం ఆరేపల్లిలో, 12న గ్రామ పంచాయతీ కార్యాలయం కోరాట్‌పల్లిలో,గ్రామ పంచాయతీ కార్యాలయం దూస్‌గావ్ లో, 13న గ్రామ పంచాయతీ కార్యాలయం ఘనపూర్ గ్రామంతో రెవెన్యూ సదస్సులు ముగుస్తుందని ఈ అవకాశాన్ని సధ్యం చేయడం చేసుకోవాలని తాహసిల్దార్ సతీష్ రెడ్డి ప్రజలను కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad