Thursday, December 4, 2025
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్ కండువాలతోనే ప్రచారం చేయండి: ప్రభుత్వ విప్ బీర్ల

కాంగ్రెస్ కండువాలతోనే ప్రచారం చేయండి: ప్రభుత్వ విప్ బీర్ల

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం 
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామాలలో గళ్ళ గురించి చెప్పాలని డిసిసి అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం మండలంలోని మేడిపల్లి, మైలారం,పెద్ద పర్వతాపూర్,చౌదర్ పల్లి,యావపూర్ తండా, మాచనపల్లి,మర్యాల,బొమ్మలరామారం, తదితర గ్రామాలలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచ్ పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అనంతరం పలు గ్రామాలలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతులకు భీమ, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువాలతో గుండెలనిండా ధైర్యంతో గ్రామంలోని ప్రచారం చేయాలన్నారు.వాటికి పూర్వవైభగం తెచ్చాలా ప్రతి కార్యకర్త పరిచేయాలని సూచించారు.ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి,ప్రజా సంక్షేమం,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రభావంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ప్రతి ఒక్కరికీ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలకు ఆకర్షితులైన వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -