Thursday, March 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేటి నుంచి భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన..

నేటి నుంచి భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కెనడా ప్రధాని మార్క్ కార్నీ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు. నేటి నుంచి మార్చి 7 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఒట్టావా నుంచి ముంబైకి చేరుకోనున్నారు. ముంబై నుంచి ఆయన పర్యటన కొనసాగనుంది. ఆర్థిక సంబంధాలు బలోపేతం కోసం వ్యాపార వేత్తలతో సమావేశం కానున్నారు. మార్చి 2న ప్రధాని మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇరు దేశాల సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, అధునాతన సాంకేతికత వంటి కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -