Sunday, October 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీకాంత్ అయ్యంగార్ 'మా' సభ్యత్వం రద్దు చేయండి: కాంగ్రెస్ డిమాండ్

శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వం రద్దు చేయండి: కాంగ్రెస్ డిమాండ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జాతిపిత మహాత్మగాంధీపై యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు సిని, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇవాళ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ తీరు తీవ్ర అభ్యంతరకరం అని ఆయన ‘మా’ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. జాతిపిత గురించి అడ్డగోలుగా, తప్పుడు స్టేట్మెంట్‍లు చేసి ఇష్టారీతిగా మాట్లాడిన తీరు సరికాదన్నారు. సినీనటుడిగా సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సింది పోయి జాతిపిత గురించి ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. శ్రీకాంత్ అయ్యర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -