Friday, September 19, 2025
E-PAPER
Homeబీజినెస్క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లింపులు రద్దు

క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లింపులు రద్దు

- Advertisement -

యూపీఐ సంస్థల నిర్ణయం
న్యూఢిల్లీ : క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లింపుల సౌలభ్యాన్ని రద్దు చేస్తున్నట్టు ఫిన్‌టెక్‌ సంస్థలు ఫోన్‌పే, పేటియం, క్రెడ్‌ వెల్లడించాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తాజా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది క్రెడిట్‌ కార్డ్‌తో అద్దె చెల్లింపు అప్షన్‌ను విరివిగా ఉపయోగిస్తోన్నారు. నగదు కొరత ఉన్న సందర్భాల్లో దీనిని ఉపయోగించుకొని క్రెడిట్‌ కార్డు ద్వారా మరో అకౌంట్‌కు సొమ్ము బదిలీ చేసి.. అక్కడి నుంచి నగదు పొంది తమ అవసరాలు తీర్చుకుంటున్నారనేది ఆర్బీఐ గుర్తించింది. దీంతో ఫిన్‌టెక్‌ సంస్థల నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. దీంతో ఇన్నాళ్లు క్రెడిట్‌ కార్డులతో అద్దె చెల్లించిన వారికి ఇక ఇబ్బందిగా మారనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -