Friday, April 3, 2026
E-PAPER
Homeకరీంనగర్ఆర్విఎం ఆర్డర్లు రద్దు చేయడం దుర్మార్గమైన చర్య

ఆర్విఎం ఆర్డర్లు రద్దు చేయడం దుర్మార్గమైన చర్య

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి 105 కోట్ల ఆర్ వి ఎం ఆర్డర్లు రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ అన్నారు. సిరిసిల్లాలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ 2026 _ 27 విద్యా సంవత్సరానికిసంబంధించి టెస్కో కు ఇచ్చిన ఏకరూప దుస్తుల ఆర్డర్ అకస్మాత్తుగా రద్దు చేస్తూ చేనేత శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంవలన చేనేత పవర్లూమ్ కార్మికుల జీవనోపాది మీద పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందనీ,టెండర్ ద్వారా ఈ ఆర్డర్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం అనేది ఒక దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు.

సిరిసిల్లలో ఆర్ వి ఎం క్లాత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చిందనీ,వస్త్రాలు తయారు చేయడానికి 50 కోట్ల విలువగల నూలు ఖరీదు చేసి వస్త్రాల ఉత్పత్తి ప్రారంభిస్తున్న సందర్భంగా అకస్మాత్తుగా చేనేత జౌళి  శాఖ ఆర్డర్లను రద్దు చేస్తున్నాము ఉత్పత్తి చేయద్దు అని ఆదేశాలు జారీ చేస్తే నూలును నమ్ముకున్న నేతన్నల పరిస్థితి ఏం కావాలనీ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రం లో పవర్లూమ్ చేనేత కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనిఇప్పటికే యుద్ధ పరిస్థితుల వల్ల అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయనీ వస్త్ర పరిశ్రమ  ఇలాంటి దుస్థితికి కారకులు ఎవరు అని ఆయన అన్నారు.

ప్రజా ప్రభుత్వం అని ప్రజల సంక్షేమం మా ప్రధాన అజండా అని చెప్పుకునే మీరు చేసే విధానంఇదేనా అని, పవర్ లూమ్చేనేత కార్మికులకు 365 రోజులుపని కల్పించాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రివిస్మరిస్తున్నారనీ,అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమయ్యే వస్త్రాలను చేనేత పవర్లూమ్ కార్మికుల ద్వారానే ఉత్పత్తి చేయించాలనీ,టెండర్ విధానం వెంటనే రద్దు చేసిటెస్కో కు విద్యా శాఖ నుండి ఏకరూప దుస్తుల ఆర్డర్స్ ను పునరుద్దరిస్తు జి ఓ జారీ చేయాలనీ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు సిరిమల సత్యం ఒగ్గు గణేష్ నక్క దేవదాస్ సందుపట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -