– ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శివ ప్రసాద్
– ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ఖర్చులపై అవగాహన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శివ ప్రసాద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ఖర్చులు సమర్పించడంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శివ ప్రసాద్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. అభ్యర్థులు రోజువారి ఎన్నికల ఖర్చు వివరాలను ఫార్మాట్ ప్రకారం నమోదు చేసుకోవాలని అందుకు సంబంధించిన అన్ని బిల్లులు భద్రంగా ఉంచుకోవాలన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సమర్పించాల్సి ఉంటుందన్నారు. మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అభ్యర్థులందరూ ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు.బ్యాలెట్ పత్రాల నమూనా కరపత్రాల ఖర్చులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఉండాలని సూచించారు.అభ్యర్థులు నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు వ్యాధులు అవుతారని వివరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



