- Advertisement -
నవతెలంగాణ- శంకరపట్నం
శంకరపట్నం మండలం, తాడికల్ గ్రామ శివారులోని ఏరడపల్లి వెళ్లే మార్గంలో శనివారం ఒక కారు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. కారు వేగంగా వస్తున్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు ప్రమాదానికి గురైన వెంటనే, అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి సహాయం అందించారు. స్థానికుల సహాయంతో కారును కల్వర్టు నుండి సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -