Sunday, July 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకారు, బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు

కారు, బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హలియా : మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగుంద్ల గ్రామానికి చెందిన పాశం లక్ష్మీకాంత్ రెడ్డి తన గ్రామంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సమీప బంధువులు గుంటూరు జిల్లా గురజాల‌కు చెందిన మోరం నాగేశ్వరరావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతి , కుమారుడు అభిరామ్ ద్విచక్ర వాహనమైన పల్సర్ బైక్ (AP39DJ6614)పై కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం ముగిసిన తరువాత అదే రోజు సాయంత్రం స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. సుమారు సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో, కోతపల్లి గ్రామ అవుట్ స్కర్ట్స్‌లోని జాతీయ రహదారి సంఖ్య 565పై కో-ఆపరేటివ్ ఆఫీస్ సమీపంలో, హాలియ వైపు నుండి వేగంగా వస్తున్న కారు (TS30J4768) బైక్‌ను ఎదురెళ్లి ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదంలో మోరం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికుడు ఇథగని సైదులు ఈ విషయాన్ని పాశం లక్ష్మీకాంత్ రెడ్డికి తెలియజేశారు. వెంటనే ఆయన, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తిగా బుడ్డి వెంకటేష్ (S/o ఇలయ్య), గాంధమల్ల గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. అతను అతివేగంగా అజాగ్రత్తగా వాహనం నడిపిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి, హాలియ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -