- Advertisement -
తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామం వద్ద, శనివారం మణుగూరు నుండి బెల్లంపల్లి వెళ్తున్న కారు అతివేగంతో కల్వర్టును ఢీ కొట్టి లోయలో పడింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు వాపోయారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ వేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదం చేసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
- Advertisement -