- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మల్లాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉషోదయ సూపర్ మార్కట్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిని కారు ఢీకొట్టింది. అతివేగంగా కారు ఢీకొనడంతో వృద్ధురాలు గాలిలో లేచి కిందపడింది. ఆ తర్వాత ఆమె పైనుంచి కారు వెళ్లింది. వెంటనే స్థానికులు స్పందించి బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సింది.
- Advertisement -



