Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్కారు బోల్తా.. ఇద్దరు మృతి

కారు బోల్తా.. ఇద్దరు మృతి

- Advertisement -

– ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై ఘటన
నవతెలంగాణ-ముదిగొండ

భారీ వర్షాల కారణంగా కారు అదుపుతప్పి కారు బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెం దిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గోకినేపల్లి గ్రామ సమీపాన ఉన్న జాతీయ రహదారి అండర్‌ పాస్‌ ఫ్లైఓవర్‌పై బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చెందిన కొండ బాల శ్రీనివాసరావు(65), పిండిప్రోలు గ్రామానికి చెందిన దొండేటి సాయి రంజిత్‌ కుమార్‌ (34) ఇద్దరూ కలిసి కారులో నల్లగొండ జిల్లా దామరచర్ల తాళ్లవీరప్పగూడెం గ్రామానికి బయలుదేరారు. గోకినేపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి దగ్గరకు వెళ్లేసరికి భారీ వర్షం కారణంగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢకొీనటంతో కారు నడుపుతున్న దొండేటి సాయి రంజిత్‌ కుమార్‌, పక్కనే కూర్చున్న కొండబాల శ్రీనివాసరావు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొండబాల శ్రీనివాసరావు అల్లుడు దొండేటి నరేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వడ్డేపల్లి మురళి తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad