Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్రానికి పంపాల్సిన పీఏఐ వివరాలను పకడ్బందీగా పూర్తి చేయండి 

కేంద్రానికి పంపాల్సిన పీఏఐ వివరాలను పకడ్బందీగా పూర్తి చేయండి 

- Advertisement -

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య
నవతెలంగాణ – వనపర్తి 
: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి పంపాల్సిన గ్రామ పంచాయతీల అభివృద్ధి సూచిక (PAI) వివరాలను పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆదేశించారు. గురువారం గ్రామ పంచాయతీల అభివృద్ధి సూచిక వివరాలు పంపే అంశంపై సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి పంపాల్సిన గ్రామపంచాయతీల అభివృద్ధి సూచిక (PAI) వివరాలను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.

గ్రామ పంచాయతీల వారీగా మొత్తం నిర్దేశించిన 9 విభాగాలలో పంచాయతీల అభివృద్ధికి సంబంధించి, 147 ఇండికేటర్స్ ను పూర్తి చేసి పంపించాలని సూచించారు. గ్రామస్థాయిలో అభివృద్ధికి సంబంధించిన147 ఇండికేటర్స్ వివరాలను సేకరించి ఎంపీడీవోల లాగిన్ ద్వారా పంపించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, డీఈవో అబ్దుల్ ఘని, జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, ముఖ్య ప్రణాళిక అధికారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -