నవతెలంగాణ – భీంగల్
ఆదివారం ఉదయం తెల్లవారు జమున భీంగల్ మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. భీంగల్ ఎస్సై సందీప్ వివరాల ప్రకారం…బెజ్జోర గ్రామ శివారులో భీంగల్ కప్పల వాగు నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేయుటకి జేసీబీ సహాయంతో ట్రాక్టర్ లో ఇసుకను నింపి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం రాగా.. స్టేషన్ ఎస్ఐ, సిబ్బందితో వెళ్ళి ఇసుకను నింపుతున్న జెసిబిని, ట్రాక్టర్ లతో పాటు వాటి యజమానులైన యిర్లా మహేందర్, మల్లెల స్వామి, దేశబోయిన రవికుమార్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినందుకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది ఎస్ ఐ సందీప్ తెలిపారు. మండలంలో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇసుక అక్రమార్కులపై కేసు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES