- Advertisement -
అక్రమంగా మద్యం నిలువ
నవతెలంగాణ – రామారెడ్డి
అక్రమంగా మద్యం నిలువ ఉందన్న నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థి పడిగల శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 96 క్వాటర్స్ మద్యం బాటీలను స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
- Advertisement -



