Friday, December 5, 2025
E-PAPER
Homeక్రైమ్ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. వ్యక్తిపై కేసు

ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. వ్యక్తిపై కేసు

- Advertisement -

నవతెలంగాణ-కోహెడ
కోహెడ మండల పరిధిలో ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు శుక్రవారం కోహెడ ఎస్సై పి. అభిలాష్ తెలిపారు. గురువారం రాత్రి కోహెడ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుప్పాల రమేష్ (45), ఎట్టబోయిన శ్రీకాంత్ (31) అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో మైసంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నందున ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం పంపిణీ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పై ముగ్గురిపై పంచాయతీరాజ్ చట్టం, ఎక్సైజ్ చట్టం, ఎన్నికల నియామావళికి సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ మండల పరిధిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేసే వారెవరైనా కఠినంగా చర్యలు తీసుకుంటమన్నారు. ప్రజలు ఎటువంటి ఒత్తిడి లేకుండా, పూర్తి స్వేచ్ఛ వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -