- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
నిబంధనలకు విరుద్ధంగా గణేష్ నిమజ్జనం సమయంలో డీజే సౌండ్ ఏర్పాటు చేసినందుకు డీజే యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భాగిర్థి పల్లి, అయ్యవారిపల్లి గ్రామాలలో డిజె సౌండ్ పెట్టినందున స్థానికులు 100 డయల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులకు సహకరించి గణేష్ నిమజ్జనం నిర్వహించాలని సూచించారు.
- Advertisement -