నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టీ రాజా సింగ్‌పై తాజాగా హైదరాబాద్‌లోని షా అలీ బందా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక దసరా కార్యక్రమం సందర్భంగా ఆయన మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణల మేరకు ఈ కేసు నమోదు అయింది. పోలీస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు పౌరులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు.
ఈ ఫిర్యాదుల మేరకు.. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్లు 61, 67 క్రింద కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని, చట్టానికి అనుగుణంగా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.