Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలురామ్‌ గోపాల్‌ వర్మపై కేసు నమోదు

రామ్‌ గోపాల్‌ వర్మపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై రాజమహేంద్రవరం మూడోపట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఆయనతో పాటు సదరు కార్యక్రమ యాంకర్‌పై కూడా కేసు నమోదైంది. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా రామ్‌ గోపాల్‌ వర్మ వ్యాఖ్యలు చేశారని.. రాజమండ్రికి చెందిన న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ ఫిర్యాధు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన త్రీ టౌన్‌ పోలీసులు, దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతో పాటు సదరు యాంకర్‌పై క్రైమ్‌ నెం 487/2025 కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.BNS Act సెక్షన్లు 196 (1), 197(1), 353, 354, 299 R/w (3) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గతంలో కూడా వర్మపై తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు అంశాలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -