Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంజనగణనతోపాటు కులగణన చేపట్టాలి

జనగణనతోపాటు కులగణన చేపట్టాలి

- Advertisement -

– మాజీ ఎంపీ వీహెచ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపట్టాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. కులగణన చేపట్టకపోతే కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జనగణనతో బీసీలకేం లాభమని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎనుముల రేవంత్‌రెడ్డి కూడా బీసీల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారని చెప్పారు. తానూ బీసీనే అంటూ చెబుతున్న ప్రధాని మోడీ వారి గురించి మాట్లాడటం లేదన్నారు. జనగణన వల్ల బీజేపీకి లాభం తప్ప బీసీలకు లాభం లేదని స్పష్టం చేశారు. కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్‌కు జైలు ఫోబియా పట్టుకుంది : టూరిజం కార్పొరేషన్‌ చైర్మెన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ హస్తం ఉండటంతోనే ఆయనకు జైలు ఫోబియా పట్టుకుందని టూరిజం కార్పొరేషన్‌ చైర్మెన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకు ఆయన వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న విమర్శలే నిదర్శనమన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కార్పొరేషన్‌ చైర్మెన్లు చల్లా నర్సింహారెడ్డి, తిరుపతితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేటీఆర్‌ రాజ్యాంగ వ్యవస్థలను అవమానించేలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఫార్ములా వన్‌ రేసులో ఆయన తప్పు చేయకపొతే విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. అధికార మదంతో ఫోన్లు ట్యాప్‌ చేసి నిస్సిగ్గుగా వ్యవహరించారని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలంటూ కేటీఆర్‌కు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad