Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం వ్యక్తికి రేగొండలో కులం సర్టిఫికెట్.!

కాటారం వ్యక్తికి రేగొండలో కులం సర్టిఫికెట్.!

- Advertisement -

ఆ సర్టిఫికెట్ జారీ చేసింది ఎవరబ్బా.?
నవతెలంగాణ – మల్హర్ రావు

కాటారం మండలానికి చెందిన వ్యక్తి రేగొండ మండలం నుంచి కులం సర్టిఫికెట్ తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి సావిత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ మీసేవ సెంటర్లో సిటిజన్ పోర్టల్ ద్వారా రేగొండ మండలకేంద్రం నుంచి కుల ధ్రువీకరణ పత్రం మంజూరు కోసం డిసెంబర్ 1న దరఖాస్తు చేసుకుంది. రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పత్రాలూ అందజేయకుండానే డిసెంబర్ 2న గాండ్ల-6 (బీసీ-బీ) కుల ధ్రువీకరణ పత్రం మంజూరైంది.

ఈ సర్టిఫికెట్తో ఆమె ఇటీవల సర్పంచ్ గా పోటీచేసి గెలుపొందింది. దీంతో ప్రత్యర్థి జనవరి 2న సమాచార హక్కు చట్టం ద్వారా కుల ధ్రువీకరణ పత్రం వివరాలను తహసీల్దార్ ను కోరగా విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై నవ తెలంగాణ రేగొండ తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా.. కాటారం మండలానికి చెందిన వ్యక్తికి జూరైన విషయం వాస్తవేమన్నారు. ఈ విషయమై ఆర్ఎ, ఇద్దరు జీపీఓలకు, జూనియర్ అసిస్టెంట్ కు మెమో జారీచేసినట్లు తెలిపారు. తప్పుడు పత్రాలతో సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. నివేదికను కలెక్టర్కు పంపినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -