Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏప్రిల్‌లో కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

ఏప్రిల్‌లో కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

- Advertisement -

గరికపాటి నర్సింహ్మారావు క్షమాపణ చెప్పాలి
దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాపై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

సాటి మనుషులంతా నాతో సమానమనే సమానత్వ భావనను పెంపొందించడానికి ఏప్రిల్‌ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటిస్తూ కులరహిత సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు పిలుపునిచ్చారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో కెేవీపీఎస్‌ ఆధ్వర్యంలో కులరహిత సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 11న జ్యోతిబాపూలే జయంతి, 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఆ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుల వివక్ష అంటరానితనాన్ని రూపు మాపాలని కులరహిత సాంస్కృతిక ఉత్సవాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.

మతం మారారనే పేరుతో దళితులకు ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు తీర్పు రావడం దళితులపై ముప్పేట దాడి చేయడమేనని అన్నారు. మతకోణంలో తీర్పులు రావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బెంచ్‌కి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. కుల వివక్ష అంటరానితనంపై ప్రజల్లో చైతన్యం చేయడానికి ప్రభుత్వమే విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డ పెట్టడంపై అవమానకరంగా మాట్లాడిన గరికపాటి నరసింహ్మారావు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరుశరాములు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు, అంబేద్కర్‌ ఐడియాలజీ మిషన్‌ అధ్యక్షులు మద్దిలేటి, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జై భీమ్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పరుశురాములు, బంగారయ్య, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి సలీంపాషా, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సాలేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -