నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూర్ మండలం మిర్దపల్లి గ్రామం లో వినాయక విగ్రహం వద్ద పిల్లులు బలి ఇవ్వడం తీవ్ర కలవరం రేపింది. వివరాలు ఇలా ఉన్నవి. గ్రామంలోని వినాయక విగ్రహం, గ్రామ దేవతల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 4 పిల్లులు గ్రామ దేవతల వద్ద1 పిల్లి ని డైమండ్ గణపతి విగ్రహం వద్ద కోసి రక్తన్ని దేవతలకు చల్లారని గ్రామ అధ్యక్షులు ఏలేటీసాయిరెడ్డి.డికొండ గంగాధర్ లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రామ దేవతలకు. గణపతికి పిల్లులను బలివ్వడం దురదృష్టకరమైన పిరికి చర్యలని. ఎవరికైనా ఏదైనా ఆపతుంటే వారు వారి ఇళ్లల్లో లేదా వాగులు వంకలు వద్ద చేసుకోవాలే తప్ప. గ్రామ దేవతల వద్ద ఇలాంటి చర్యలు చేయడం గ్రామానికి అనిస్టమఉతోందో. గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీడిసి ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తు మేరకు ఏదైనా ఆనవాయువులు దొరుకుతే బలిదానం చేసిన వ్యక్తి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు.
డైనమిక్ యూత్ గణపతి చిన్నపిల్లలు నిలుపుకున్న గణపతి వద్ద రాత్రివేళలో ఎవరు కూడా ఉండరు. ఒక శటర్ లో గణపతి ఇంకొక శటర్ లో పిల్లలు భజన పాటలు పాడుకోవడానికి ఉంది. శనివారం అర్ధరాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు గణపతి వద్ద పిల్లిని బలిదానం ఇచ్చి గణపతికి రక్త మరకలను అంటించారు. ఉదయం భక్తులు చూసి భయాందోళనలకు గురయ్యారు. అప్రమైత్తమైన భక్తులు గ్రామ కమిటీకి జరిగిన విషయాన్ని సూచించారు. గ్రామ కమిటీ పెద్దలు గణపతికి ఎలాంటి రక్తం మరక ఉండకూడదని పాలాభిషేకం నిర్వహించారు.
ప్రతి ఆదివారం గ్రామదేవతల వద్ద ఆలయ ప్రాంగణంలో చెత్త చెదరాన్ని తొలగించిశుభ్రం చేస్తారని. శనివారం అర్ధరాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు పిల్లులను బలిదానం ఇచ్చి. కొబ్బరికాయలను కొట్టారని.ఉదయం వచ్చి ఇక్కడ చూసే సరికి 4.పిల్లులను కోసి దేవతలకు బలి ఇచ్చారని. కొబ్బరి పచ్చలు కూడా వదిలి వెళ్లారని. ఆదివారం జరిగిన సంఘటనను గ్రామ విడిసికి సమాచారం అందించగా గ్రామ విడిసి ప్రజలు వచ్చి అవక్కయారు. నీటితో రక్త మరకను తొలగించి. బలిదానం చేసిన పిల్లలను మట్టిలో కలిపేశారు.జరిగిన సంఘటన పై గ్రామస్తులు కొంతమేరకు భయపడుతూ గ్రామంలో ఏదైనా అపశుభాలు జరుగుతాయేమోనని. గ్రామం పుట్టి నుండి ఇప్పటివరకు ఇలాంటివి ఏనాడు జరగలేని.వినలేని దృశ్యాలు. గ్రామ దేవతల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని.
ప్రజలు యువకులు ఎలాంటి అపోహలకు గురకవద్దని ఆ దేవతల వల్ల అందరికీ మంచి జరుగుతుంది కానీ చెడు జరగకుండా కాపాడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. మిర్దపల్లి గ్రామంలో జరిగిన సంఘటన గ్రామ విడిసి , గ్రామదేవతలు, గణపతి విగ్రహాలను పరిశీలించి ఉన్నత అధికారులకు సమాచారం అందించినానని. వారి ఆదేశాల పైన కేసులు నమోదు చేసి. పిల్లులను గ్రామ దేవతలకు బలిచ్చిన వ్యక్తులను త్వరలో పట్టుకుంటామని. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టాన్ని ఎవరు కూడా చేతులకు తీసుకోవద్దని. దోషి ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.