Friday, December 5, 2025
E-PAPER
Homeసినిమా'సిగ్మా'లో కేథరిన్‌ స్పెషల్‌ సాంగ్‌

‘సిగ్మా’లో కేథరిన్‌ స్పెషల్‌ సాంగ్‌

- Advertisement -

సుబాస్కరన్‌ నేతత్వంలోని లైకా ప్రొడక్షన్స్‌ జాసన్‌ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్‌-అడ్వెంచర్‌ కామెడీ ‘సిగ్మా’ను నిర్మిస్తోంది. ఇందులో సందీప్‌ కిషన్‌ హీరో. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్‌, యోగ్‌ జాపీ, సంపత్‌ రాజ్‌, కిరణ్‌ కొండా, మగలక్ష్మి సుదర్శనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు ఉన్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్‌ కేథరిన్‌ థ్రెసా, సందీప్‌ కిషన్‌తో కలిసి డ్యాన్స్‌ చేయనుంది. దీని కోసం తమన్‌ పవర్‌ఫుల్‌ ట్రాక్‌ను కంపోజ్‌ చేశారు. భారీ, కలర్‌ ఫుల్‌ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో సందీప్‌ కిషన్‌, కేథరిన్‌ థ్రెసా హై-ఎనర్జీతో స్క్రీన్‌ను ఉర్రూతలూగిస్తుంది. తమిళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ మల్టీ లింగ్వెల్‌ ప్రాజెక్ట్‌, చెన్నై, తలకోన అడవులు, థాయిలాండ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్‌ జరుపుకుంది. పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -