నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామంలో పశువుల మృత్యువాతలు శనివారం కూడా కొనసాగింది. పాడి రైతు శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం రూ.20 నుండి రూ.30 వేల విలువైన కోడె గత మూడు రోజులుగా అనారోగ్యంతో మేత తినకుండా, నీళ్లు తాగకుండా అనారోగ్యంగా ఉంది. బుధవారం సాయంకాలం నుండి 1962 టోల్ ఫ్రీ నెంబర్ కు పలుమార్లు ఫోన్ చేసిన సంచార పశువుల వైద్య సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళనకరంగా ఉన్నారు. స్థానిక మండల పశు వైద్యాధికారి స్థానికంగా ఉండడం లేదని వైద్యాధికారికి , సిబ్బందికి పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి కలిసి సమస్యను తెలిపినప్పటికీ ఎటువంటి వారి నుండి స్పందన లేకపోవడంతో మూగజీవాల మృత్యుఘోష గత రెండు రోజులుగా నిరంతరం కొనసాగుతూ వస్తుంది.
గ్రామాలలో వైద్య సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఒక్కొక్క పాడి రైతులకు వేల రూపాయల విలువైన పశుసంపద మృత్యువాత పడడంతో ఆర్థిక నష్టం కలుగుతుందని రైతులు అన్నారు. జుక్కల్ పశువుల ఆస్పత్రిలో అసలు విధులు నిర్వహిస్తున్న వైద్యుడు, సిబ్బంది ప్రజల కొరకు పనిచేస్తున్నారా.. లేక వారి ఇంటి వ్యక్తిగత విషయాల గురించి పని చేస్తున్నారా? అన్న అంశము పైన ప్రశ్న గ్రామీణ ప్రాంతాలలో మండలంలో చర్చ కొనసాగుతుంది. స్పందించని అధికారులపై విధులకు గైరాజరవుతున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాగల్ గావ్ లో ఆగని పశువుల మృత్యువాతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES