Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స క్యాంపు

పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స క్యాంపు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మాహమ్మదాబాద్ గ్రామంలో పశుసంవర్ధక మండల శాఖ వెటర్నరీ డాక్టర్ పండరి నాథ్ , డి ఎల్ డి ఏ గోపాలమిత్ర ఆధ్వర్యంలో మంగళవారం పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స క్యాంపు కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సూర్నార్ శకుంతల ముఖ్య అతిథిగా పాల్గొని గర్భకోశ చికిత్స క్యాంపు శిబిరాన్ని  ప్రారంభించారు. వెటర్నరీ వైద్యుడు పండరి మాట్లాడుతూ మండలంలోని గోపాల మిత్రుల ఆధ్వర్యంలో ఈ గర్భకోశ చికిత్స క్యాంపు నిర్వహించడం వలన పశువులకు గర్భస్థము లో ఏర్పడే సమస్యలను మరియు జన్యు ఉత్పత్తి నూతన మేలు రకం పశువులను జన్మించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పశువులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తయని అన్నారు. 24 గేదెలకు,  15 ఆవులకు, గర్భకోసి చికిత్స నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవన్ రాథోడ్ ఉపసర్పంచ్ పోతుల లక్ష్మణ్, సూపర్ వైజర్ , గోపాల మిత్రులు,  పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -