- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అనిల్ అంబానీ కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అనిల్ అంబానీ కంపెనీలకు, యెస్ బ్యాంకుకు మధ్య.. లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. 2017లో RCFLలో రూ.2047 కోట్లను.. RHFLలో రూ.2965 కోట్లను యెస్ బ్యాంక్ పెట్టుబడి పెట్టింది. కేర్ రేటింగ్స్ హెచ్చరించినా యెస్ బ్యాంక్ నాటి అధినేత రాణా కపూర్ ఆమోదంతోనే పెట్టుబడులు పెట్టారని సీబీఐ తెలిపింది. ప్రజాధనాన్ని వివిధ దశల్లో పక్కా ప్రణాళికతో పక్కదారి పట్టించారని తెలిపింది.
- Advertisement -