Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సంఘాల పుస్తకాలను తనిఖీ చేసిన సిబిఓ ఆడిటర్ 

గ్రామ సంఘాల పుస్తకాలను తనిఖీ చేసిన సిబిఓ ఆడిటర్ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని పలు గ్రామాల మహిళా గ్రామ సంఘాల పుస్తకాలను సి బి ఓ ఆడిటర్  భోజన్న గురువారం తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన గ్రామ సంఘ పుస్తకాలను ఏప్రిల్ 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు వ్రాసిన గ్రామ సంఘ పుస్తకాలను తనిఖీ చేశారు. ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహిస్తూ, గ్రామ సంఘాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఉన్నారు. పొదుపులు వాటాదరుల వాటధనం , సభ్యత్వం , అప్పుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పలు గ్రామాల అధ్యక్షులు, వివో ఏలు,  మండల సమైక్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -