– సొంత ఖర్చులతో నిర్మాణానికి ముందుకు వచ్చిన ఓర్సు సమ్మయ్య
– అభినందించిన నైనాల గ్రామ ఉప సర్పంచ్
నవతెలంగాణ నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామంలో హనుమాన్ ఆలయంలో గ్రామానికి చెందిన ఓర్సు సమ్మయ్య తన సొంత ఖర్చులతో సిసి చేయించడానికి ముందుకు వచ్చినందున అతని అభినందించినట్లు ఆ గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్ తెలిపారు. సోమవారం ఆలయ భూదాత లు వాసిరెడ్డి లక్ష్మారెడ్డి, యాదగిరి రెడ్డిలతో కలిసి ఆ గ్రామ ఉపసర్పంచ్ ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ దాతలు వాసిరెడ్డి లక్ష్మారెడ్డి యాదగిరి రెడ్డి లు ఈ ఆలయానికి నాలుగు గుంటలు భూమి ఇవ్వడం పట్ల వారిని అభినందించినట్టు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన ఓర్సు సమ్మయ్య హనుమాన్ ఆలయం ఆవరణలో తన సొంత ఖర్చులు సుమారు మూడు లక్షల రూపాయలతో సిసి వస్తున్నందుకు వారిని గ్రామస్తులు అభినందించి హర్ష వ్యక్తం ప్రకటించిన తెలిపారు.
ఆలయ అభివృద్ధి కోసం వారు ముందుకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు గ్రామ ప్రజలు అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చిర్ర శ్రీనివాస్, దండంపెల్లి వెంకట సాయిలు, వాసిరెడ్డి దేవేందర్ రెడ్డి, మామిండ్లపల్లి నరసింహచారి, చట్ల సత్తయ్య, చట్ల బాబు, వార్డ్ మెంబర్ ఆకుల యాకయ్య, నార బోయిన గుట్టయ్య, గిరిశెట్టి అరుణ రమేష్, శివార్ల ఎలేంద్ర కొమరయ్య, ఏర్పుల శృతి సరేష్, ఆకుల వెంకటేష్, యాసం వెంకటేశ్వర్లు, బొడ్డు విజయ్ కుమార్, ఆకుల జ్యోతి చెన్నమల్లు, యూత్ నాయకులు శివార్ల నాగేష్ బాబు, ఏర్పుల బిక్షపతి, ఏర్పుల వేణు,ఏర్పుల సురేష్ గ్రామ పెద్దలు తోట వెంకన్న, అల్లం వీరయ్య, చట్ల సంతోష్, రామరాజు సమ్మయ్య, తోట రమేష్, మాజీ సర్పంచ్ ఏనుటి సాయిలు, ఎండి అప్సర్ పాషా, తోట శ్రీను, చెడుపాక వెంకన్న, చెడుపాక యాకయ్య, ఆకుల వీరయ్య, చెడుపాక యాకయ్య, సారయ్య పాల్గొన్నారు.



