కిసాన్ కపాన్‌తో కౌలు రైతులకు తీవ్ర నష్టం
పత్తి దిగుమతులపై సుంకం ఎత్తివేత నష్టదాయకం
పాలకుల విధానాలపై ఐక్యపోరాటాలే శరణ్యం : సారంపల్లి మల్లారెడ్డి
బీజేపీ ఎంపీలు రైతుల కోసం ఎందుకు పని చేయట్లేదు
రైతులకు మార్కెంటింగ్, పంట నిల్వ సదుపాయాలను పెంచాలి : కన్నెగంటి రవి
రైతుల మీద ప్రేమలేదు: పృథ్వీరాజ్
ఎస్వీకేలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళారులతో సీసీఐ కుమ్మక్కు కావడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి చెప్పారు. కిసాన్ కపాస్ యాప్ రైతు లకు ఇబ్బందికరంగా మారిందనీ, కౌలు రైతు లకు తీవ్ర నష్టదాయకంగా మారిందని తెలిపా రు. యాప్‌లో నమోదు చేసుకోవడంలో ఇబ్బం దులు, 12 శాతం తేమ పేరుతో నిబంధనలతో రైతులు తమ పత్తి పంటను దళారులకు అమ్ము కుని క్వింటాకు రూ.2 వేలు నష్టపోతున్నారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సమస్యలపై రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మొంథా తుపాన్ ప్రభావం వల్ల తాము ఏవిధంగా నష్టపోయా మనే దాన్ని బాధిత రైతులు పంచుకున్నారు. పంట నష్టపరిహారం రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం సారంపల్లి మల్లా రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో 20 లక్షల మంది రైతులు రుణాలు పొందలేక పోతున్నా రని తెలిపారు. కౌలురైతులకు ప్రత్యేకంగా గుర్తిస్తామన్న హామీని రాష్ట్ర సర్కారు నెరవేర్చ లేదని విమర్శించారు. కిసాన్ కపాస్ యాప్‌పై సీసీఐ అధికారులకే అవగాహన లేదనీ, ఇక రైతులు ఎలా అప్లరు చేసుకోగలుగుతారని ప్రశ్నించారు. అమెరికా నుంచి పత్తి దిగుమతు లపై సుంకాన్ని ఎత్తివేయడం పట్ల తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశారు. మన దేశంలో బాగా పండే పత్తి, మిరప, పసుపు పంటలను, పాల ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతులు ఏం కావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి మాట్లా డుతూ…రైతులను దళారులు దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే అనుమతిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. ఎమ్‌ఎస్. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల నుంచి పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్రంలో రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు, ఆరబెట్టుకునేందుకు గిడ్డంగులు, కల్లాలను, డ్రైయింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌సీఐలో నిల్వ ఉన్న కిలో బియ్యంకు రూ.40 ధర ఉంటే ఇంథనాల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రూ.22కు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సామాజిక కార్యకర్త పృద్వీరాజ్ మాట్లాడుతూ..మతం, కులం, స్వదేశీ జపంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేవునికి దీపం పెట్టడానికి ఉపయో గించే పత్తిని అమెరికా నుంచి దిగుమతి చేసేందుకు ఎలా అనుమతిచ్చింది? విదేశాల నుంచి పాలు, పసుపు, పత్తి, మిరప పంటలను దిగుమతి చేసుకోవడమేనా దేశభక్తా ? అని నిలదీశారు. రైతుల హక్కుల కోసం ఐక్యంగా లడాయి చేయడమే మార్గమని నొక్కి చెప్పారు.
రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు న్యాయం దక్కాలంటే సమగ్ర వ్యవసాయ విధానాన్ని, పంటల ప్రణాళికను తేవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారం తయారు చేయడంలో లోపాలను సవరించాలని కోరారు. పటిష్టమైన పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంట విధానాన్ని తీసుకురావాలని కోరారు. రైతులకు సలహాలిచ్చి చైతన్యపరిచేందుకు ప్రత్యేక కమిటీలు వేయాలని రాష్ట్ర సర్కారుకు సూచిం చారు. ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, ఎస్‌కేఎమ్ రాష్ట్ర నాయకులు జక్కుల వెంకటయ్య, రైతు స్వరాజ్యవేదిక రాష్ట్ర నాయకులు కొండల్ రెడ్డి, నాయకులు భార్గవి, హర్ష, అరణ్య, తదితరులు పాల్గొన్నారు.
దళారులతో సీసీఐ కుమ్మక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



