Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ విజయంతో టీజేఎస్‌ కార్యాలయంలో సంబురాలు

కాంగ్రెస్‌ విజయంతో టీజేఎస్‌ కార్యాలయంలో సంబురాలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించడంతో టీజేఎస్‌ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్బంగా టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం నవీన్‌ యాదవ్‌ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని బస్తీల్లో సమస్యల పరిష్కారానికి టీజేఎస్‌ నాయకులు, కార్యకర్తలపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. నగరంలో టీజేఎస్‌ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించాలని నగర కమిటీని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లె వినయ్ కుమార్‌ , రమేష్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -