Thursday, January 1, 2026
E-PAPER
Homeకరీంనగర్సెలెస్టియల్ హై స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

సెలెస్టియల్ హై స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

- Advertisement -


నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్ హైస్కూల్లో కరస్పాండెంట్ బుర్ర రాధ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026 వేడుకల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించడం జరిగింది. సుమారు 200 మంది విద్యార్థిని, విద్యార్థులు భారత దేశంలోని 28 రాష్ట్రాల ప్రజల యొక్క వేషధారణలు వేసి 28 రాష్ట్రాల ప్రజలు తినే సుమారు 150 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి 28 ఫుడ్ స్టాళ్లలో ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాభిమానులు, పుర ప్రముఖులు వచ్చి వీక్షించి, విద్యార్థులను ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది.

అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ పాటలపై విద్యార్థులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బుర్ర రాధకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. భారతదేశ ఉపఖండం విభిన్న మతాలు, విభిన్న భాషలు, సంస్కృతులతో, వేషాధారణలతో కూడిన దేశమని కావున భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో వివిధ ఆహార అలవాట్లు కలిగి ఉన్నారని  వివిధ రాష్ట్రాల వేషధారణ పట్ల, వారి ఆహార అలవాట్ల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడానికి ఈ ఫుడ్  ఫెస్టివల్ చాలా ఉపయోగపడుతుందన్నారు. భారతీయులందరము సమైక్యంగా ఉండడానికి ఇటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ మచ్చ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -