నవతెలంగాణ – డిచ్ పల్లి: మండలంలోని మిట్టపల్లి గ్రామ శివారు లోని సర్వేనెంబర్ 836/4 లో ముస్లిం సోదరులకు సంబంధించిన స్మశాన వాటిక, ఈద్గా లకు చెందిన భూమి రికార్డులో నమోదు చేయాలని కోరుతూ సోమవారం తహసిల్దార్ సతీష్ రెడ్డి కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నిజామాబాద్ రూరల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్చార్జ్ షేక్ జుబేర్ హైమద్ అద్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా ఇన్చార్జ్ షేక్ జుబేర్ హైమద్ మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామ శివారు లోని సర్వేనెంబర్ 836/4 లో కబ్రస్తాన్, ఈద్గా కలిగి ఉందని అభూమి ని రికార్డులో నమోదు చేసేవిధంగా చుడాలని విన్నవించారు.ఈ కార్యక్రమం లో ముస్లిం మైనార్టీ కమిటీ సభ్యులు షేక్ ఆరిఫ్ హైమద్, షేక్ అబ్దుల్లా, షేక్ జుబేర్ అహ్మద్ తోపాటు తదితరులు ఉన్నారు.
స్మశాన వాటిక, ఈద్గాలను రికార్డులో నమోదు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES