Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకావాలనే జనగణన ఆలస్యం

కావాలనే జనగణన ఆలస్యం

- Advertisement -

– ఇది కేంద్రం పన్నుతున్న దుష్ట పన్నాగం
– దక్షిణాది రాష్ట్రాల హక్కులను నిర్వీర్యం చేస్తోంది : తమిళనాడు సీఎం స్టాలిన్‌
చెన్నై:
జనగణన, నియోజక వర్గాల పునర్విభజన విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు తీరుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని లెక్కలు వేసుకొని కావాలనే జనగణన, నియోజక వర్గాల పునర్విభజనను ఆలస్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ”కేంద్రం అన్ని లెక్కలు వేసుకొని కావాలనే జనగణన, నియోజకవర్గాల పునర్విభజనను ఆలస్యం చేస్తోంది. జనగణన ఆలస్యం దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పన్నుతున్న దుష్టపన్నాగమే. కేంద్రం దక్షిణాది రాష్ట్రాల హక్కులను నిర్వీర్యం చేస్తోంది. జనగణన ఆలస్యం అప్పటికప్పుడు తీసుకొన్న నిర్ణయం కాదు.. నియోజకవర్గాల పునర్విభజన ప్రణాళిక యాదృచ్ఛికం కాదు. పునర్విభజనతో ప్రస్తుతమున్న 543 లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య కొనసాగినా.. 848కి పెంచినా జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇది తమిళనాడుకు మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకూ ప్రమాదకరం. దీనితో ప్రభావితమయ్యే రాష్ట్రాల డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ప్రకటించినప్పటికీ అవి అస్పష్టమైన వ్యాఖ్యలుగానే మిగిలిపోయాయి. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హౌదాను పునరుద్ధరించాలని అక్కడి ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ అది కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గానే మిగిలి పోయింది. కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగినా, రాష్ట్ర హౌదా విషయంలో సుప్రీంకోర్టులో హామీలు ఇచ్చినా ఏమీ లాభం లేకుండా పోయింది” అని స్టాలిన్‌ విమర్శించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img