Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అలూర్ మండల కేంద్రంలోని శతాధిక వృద్ధురాలు మృతి

అలూర్ మండల కేంద్రంలోని శతాధిక వృద్ధురాలు మృతి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
అలూర్ మండలం కేంద్రానికి చెందిన తెనుగు పెద్దవ్వ (102) బుధవారం రాత్రి వయోభారంతో మృతి చెందారు. ఆమె తన జీవితకాలంలో గ్రామంలో పెద్దగా పేరు తెచ్చుకున్న మహిళగా, సాదాసీదా జీవన విధానంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెనుగు పెద్దవ్వ తెనుగు గంగాధర్ తల్లి కాగా, చిన్న గంగు కోడలు. మనుమలు తెనుగు భూమేష్, తెనుగు సుమన్, ముని మనుమల్లు సైతం ఉన్నారు. గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున ఆమె నివాసానికి చేరుకుని చివరి చూపు చూసి నివాళులర్పించారు. గ్రామంలో దుఃఖ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు పెద్దవ్వ సుదీర్ఘ జీవితం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -