నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసులను సోమవారం కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా గాడి ప్రవీణ్‌కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహుద్దీన్ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టులో 42 మంది జడ్జిలు ఉండాలి. ప్రస్తుతం 26 మంది ఉన్నారు. కొత్తగా నలుగురిని నియామకంతో ఈ సంఖ్య 30కి చేరనుంది. అలాగే ఏపీ సహా మరో నాలుగు రాష్ట్రాల హైకోర్టులకూ న్యాయమూర్తుల నియామకానికీ కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వీరంతా న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అదనపు జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES