నవతెలంగాణ- తుంగతుర్తి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు దాటినప్పటికీ కాంటాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని బండరామారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుండి రైతాంగం అన్ని విధాల నష్టపోతూ ఇబ్బందులకు గురవుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత మంత్రితో మాట్లాడి వెంటనే మిల్లులు కేటాయించి కాంటాలు అయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో కల్లాల్లో నోటికాడికి వచ్చిన పంటను కాపాడుకోవడానికి రైతులు పడే బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు.ధా న్యం రాశుల మీద పట్టాలు కప్పి ఉంచితే ధాన్యం రంగు మారుతుంది అనే భయం మరోవైపు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత మంత్రితో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్, జటంగి బక్కయ్య, రేగటి రాములు, సూరయ్య, ఉప్పలయ్య, ఏకస్వామి మహిళ రైతులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాలు తెరిచారు.. కొనుగోళ్లు మరిచారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



