ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ – కంఠేశ్వర్
విద్యార్థినీల హక్కులకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో స్థానిక టి ఏ పి ఆర్ పిఏ ( TAPRPA) భవన్ లో ఆహ్వాన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక అధ్యక్షతన వహించడం జరిగింది. అనంతరం ఎస్ ఎఫ్ ఐ మాజీ నాయకులు సీతారామ్ ఏచూరి కి నివాళి అర్పించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు హాజరై బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుండి విద్యారంగానికి దేశం లో నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందని ఉన్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి కాషాయకరణను చేయడం సరి కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజిస్తుందని అన్నారు ఒకటి షైనింగ్ ఇండియా మరొకటి సఫరింగ్ ఇండియాగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగంలో పేద ధనిక అనే భావనను తీసుకురావడం సరికాదని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ మాట్లాడుతూ మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లో ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్ని అన్నారు.మహిళల విద్యార్థినీల పైన అత్యాచారాలు మానభంగాలు పెరిగిపోయాయని అదేవిధంగా ప్రతి నిమిషానికి మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సేఫ్టీ నాప్కిన్స్ అందించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ రాష్ట్ర విద్యార్థినీలకు ఎస్ఎఫ్ఐ అండగా ఉంటూనే ఆడపిల్లలను పుట్టనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో విద్యార్థినిలకు అందజేస్తామన్న స్కూటీల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఈ నాగలక్ష్మి, మహిళా శ్రామిక కన్వీనర్ నూర్జహాన్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత , స్ప్రింగ్ ఫీల్డ్స్ పాఠశాల చైర్మన్ ప్రవీణ్, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి సిర్ప లింగం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దీపిక, విగ్నేష్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు అజాద్, చక్రి, జిల్లా నాయకులు గోవింద్,రాజు, వినీత్, బాలమని, సరిత,రూప తదితర నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థినీల హక్కులకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES