నవతెలంగాణ – హైదరాబాద్
ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళీ కృష్ణ మంగళవారం హైదరాబాద్‌లో కార్పొరేట్ క్లయింట్లతో భేటీ అయ్యారని ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. పారిశ్రామిక వర్గాల క్లయింట్లతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వారితో సన్నిహితంగా సంపద్రింపులు చేసే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగిందని పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ ప్రస్తుతం అధిక ద్రవ్యత (లిక్విడిటీ) కలిగి ఉందని, దీంతో రుణ వృద్ధి కోసం చురుకుగా ముందుకు సాగుతోందని మురళీ కృష్ణ తెలిపారు. బ్యాంక్ కీలక కార్యక్రమాలు, సంస్థాగత అప్‌డేట్‌లు, భవిష్యత్తు వృద్ధి అవకాశాలపై చర్చించారు. ప్రస్తుతం రూ. 7 లక్షల కోట్ల వ్యాపారాన్ని కలిగి ఉన్న తమ బ్యాంక్ ఈ ఏడాది రూ. 8 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ లక్ష్య సాధనలో కార్పొరేట్ క్లయింట్లతో సన్నిహిత సహకారం కీలకమని అన్నారు.
కార్పొరేట్ల క్లయింట్లతో సెంట్రల్ బ్యాంక్ ఈడీ భేటీ
- Advertisement -
- Advertisement -