Friday, November 14, 2025
E-PAPER
Homeబీజినెస్సెంట్రల్‌ బ్యాంక్‌ వరుస రుణ క్యాంపులు

సెంట్రల్‌ బ్యాంక్‌ వరుస రుణ క్యాంపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
ప్రభుత్వ రంగంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్తంగా నవంబర్‌ నెలలో రుణాల జారీ కోసం ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 14న వ్యవసాయ ఆధారిత రుణ శిబిరాలు, 21న ఎంఎస్‌ఎంఈ లోన్‌ క్యాంప్‌, 28న రిటైల్‌ లోన్‌ క్యాంపైన్‌ను చేపడుతున్నట్టు వెల్లడించింది. ఖాతాదారులకు రుణాలను చేరువ చేయడమే వీటి లక్ష్యమని సెంట్రల్‌ బ్యాంక్‌ వరంగల్‌ రీజినల్‌ హెడ్‌ వి క్రిష్ణమోహన్‌ తెలిపారు. ఈ క్యాంపుల్లో రైతులకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన రుణాలపై అవగాహన కూడా కల్పించనున్నామన్నారు. అదే విధంగా అర్హత కలిగిన లబ్దిదారులకు రుణ ఆమోద పత్రాలూ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -