– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ధూపటి వెంకటేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంగా పనిచేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ధూపటి వెంకటేష్ అన్నారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో బీహార్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ అక్రమంగా లక్షలాది ఓట్లను తొలగించడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపుమేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాట్లాడుతూ..రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సమస్త అన్న విషయాన్ని విస్మరించిన భారత ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని అన్నారు.
భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని, ఏ పార్టీకి అనుబంధంగా పని చేయొద్దని, బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన పని దేశంలో రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం అయినాయి అనడానికి సంకేతం అని వారన్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు ఆయుధమని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జులై 27న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పత్రిక ప్రకటనల మేరకు 7.24 కోట్ల ఎన్యుమరేషన్ ఈ నమోదు పత్రాలు సేకరించబడి రిజిస్టర్ లో పేర్లు ఉండగా.. 2025 జూన్ 24న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభించిన రోజున రాష్ట్ర ఓటర్ల జాబితాలో 7.89 కోట్ల ఓట్లు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 7.24 కోట్ల అని చెబుతున్నారని, 65.6 లక్షల ఓట్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
ఇంత మంది శాశ్వతంగా వలసపోయారని ఎలా నిర్ధారణకు వచ్చారని, ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తూ దేశంలో బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషిస్తుందని వారు అన్నారు. బీహార్ రాష్ట్రంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 0 ఇంటి నెంబర్లతో 2.92లక్షల ఓటర్లు ఉన్నారని అన్నారు. బీజేపీ దేశంలో అధికారంలోకి రావడానికి ఇలాంటి తప్పుడు పద్ధతులను అవలంబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మోరిగాడి రమేష్, జూకంటి పౌలు, సూదగాని సత్యరాజయ్య, వడ్డేమాను బాలరాజు, తాళ్లపల్లి గణేష్, పీక్క గణేష్, ఘణగాని మల్లేశం, కాసుల నరేష్, మద్దెల కుమార్, చౌడబోయిన యాదగిరి, గొడుగు దాసు, యాసారపు ప్రసాద్, ఎండి.అఖిల్, గనగాని రాజు, బర్ల సిద్దులు, ఎర్ర రాజు, రాచర్ల సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంగా పనిచేస్తోంది: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES