నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రక్షణ, భద్రతా దళాల కార్యకలాపాలకు సంబంధించిన వార్తల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటువంటి సున్నితమైన అంశాల ప్రత్యక్ష ప్రసారాలు, ‘సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ రాసే కథనాల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానెళ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులకు ఒక సలహా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గత నెలలో విడుదల చేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది. జాతీయ భద్రత దృష్ట్యా, రక్షణ కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలకు సంబంధించి ఎలాంటి రియల్ టైమ్ కవరేజీ, దృశ్యాల ప్రసారం లేదా ‘సన్నిహిత వర్గాల సమాచారం’ ఆధారిత వార్తలను ప్రచురించవద్దని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమస్యాత్మక సమాచారం ముందుగానే బయటకు పొక్కితే, అది శత్రు మూకలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని, తద్వారా సైనిక చర్యల సమర్థతకు, సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
మీడియా సంస్థలకు కేంద్ర మంత్రిత్వ శాఖ కీలక సూచన..
- Advertisement -
- Advertisement -