Wednesday, October 8, 2025
E-PAPER
Homeజిల్లాలుపోచారం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం..

పోచారం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం..

- Advertisement -

నవతెలంగా – నాగిరెడ్డిపేట్
ఆగస్టు నెల 27న భారీ వర్షాల కారణంగా ప్రకృతి వైపరీత్యం జరిగిన నేపథ్యంలో బుధవారం రోజు ఐ.ఎం.సి.టి. ఇంటర్ మినిస్టర్ సెంట్రల్ టీం జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పీకే రాయి బృందం బంజారా శివారులో నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. పంటలు నీట మునగటనికి గల కారణాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను అడిగి తెలుసుకున్నారు. పంటలు ప్రతిసారి నీట మునుగుతాయా లేదా భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగే పరిస్థితి ఏర్పడిందా  అని  అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని 103 సంవత్సరాల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు ను వారు పరిశీలించారు.

ఆగస్టు 27న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి ఎన్ని క్యూసెక్కుల నీరు రావడం జరిగింది  అని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. 70 వేల క్యూసెక్కుల వరద నీటి సామర్థ్యం కొరకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు ఏకంగా 1,82,000 క్యూసెక్కుల వరద నీరు రావడం జరిగిందని తద్వారా ప్రాజెక్టు పూతకు గురి కావడం జరిగిందని ఆయన వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేశారని అడిగి తెలుసుకున్నారు. గ్రానైట్ రాయి గంగు సున్నంతో నిర్మాణం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. వారి వెంట ఇరిగేషన్ ఈ ఈ మల్లేశం, డి ఎ ఓ మోహన్ రెడ్డి, డి ఈ ఈ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ పార్థసింహారెడ్డి, ఏ డి ఏ సుధా మాధురి, తాసిల్దార్ శ్రీనివాసరావు, ఏ వో సాయికిరణ్, ఏఈ అక్షయ్, ఆర్ ఐ మహమ్మద్, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -